

మనన్యూస్,కామారెడ్డి:పట్టణంలోని గాంధీ నగర్లో గల ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం లో ఎన్నికల అధికారులు మోటూరి పురుషోత్తం,చాట్ల లింగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా సిద్ధంశెట్టి రమణ,ప్రధాన కార్యదర్శి నంగులూరి వెంకటేశం,కోశాధికారి శిల వెంకట రాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి రమణ,ప్రధాన కార్యదర్శి నంగునూరి వెంకటేశం,కోశాధికారి వెంకట రాజయ్య మాట్లాడారు రెండు సంవత్సరాలుగా ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.మా మీద నమ్మకముతో మమ్ములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా వంతుగా సహాయ సహకారం చేస్తామని తెలిపారు.నిరుపేద ఆర్యవైశ్య సంఘం కుటుంబ సభ్యులకు తోడ్పాటు అందిస్తామని,పైన అంతస్తు కూడా సంఘ సభ్యుల సహకారంతో కట్టిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు సునీల్ కుబ్బ,వెంకట రాజం,తృప్తి అనిల్,కాముని సందీప్,కస్పా శ్రీనివాస్,పప్పుల సోమశేఖర్,ఆర్యవైశ్య అభివృద్ధి సంఘ సభ్యులు పాల్గొన్నారు.