

మనన్యూస్,తవణంపల్లి:పైమఘం సుగుణాకర్ రెడ్డి అరగొండ కరీం గార్ల స్నేహం జ్ఞాపకార్థంగా గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించబడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీం మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించినటువంటి పైమఘం సుగుణాకర్ రెడ్డి గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్ మిషన్ రే అందించడం ఆనందకరంగా ఉందని అందుకు కావలసినటువంటి రూమ్ షెడ్డు నిర్మాణాన్ని కరీం నిర్మించారు.ఈ కార్యక్రమంలో రఘునాథ్ చౌదరి ,గాజులపల్లి మైనారిటీ ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ లో నిర్మించి ఇచ్చినందుకు పైమఘం సుగుణాకర్ రెడ్డి కి మరియు అరగొండ కరీం కి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.