

- వేసవి కాలంలో త్రాగునీరు సమస్య లేకుండా చూడండి అధికారులకు ఆదేశాలు ఎంపీడీవో మోహన్ మురళి
మన న్యూస్ ఎస్ఆర్ పురం :-
మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీపీ సరిత అన్నారు సోమవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో ఎంపీడీవో మోహన మురళి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు . ఎండ కాలంలో త్రాగునీరు కు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తామని అన్నారు ఎక్కడైనా తాగునీరు సమస్య ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మండలంలో రెవిన్యూ సమస్యలు ఉన్నవారు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని తాసిల్దార్ లోకనాథం పిళ్ళై అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు నూతన గృహములు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అర్హులైన వారు గృహం నిర్మాణ శాఖ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, ఈవోపిఆర్డిఓ కోదండరామిరెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి నర్మదా, ఏపిఎం రోజా, ఏపీవో చంద్రశేఖర్, పశు వైద్య అధికారిని శ్రీవిద్య, విద్యుత్ శాఖ ఏఈ , ఎంఈఓ అరుణాచలం రెడ్డి, సబర్మతి, గృహ నిర్మాణ శాఖ ఏఈ సాయి కుమార్, పి ఆర్ ఏ ఈ సునీల్ మండల అధికారులు సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.