తవణంపల్లి ఫిబ్రవరి 17 మన న్యూస్

తవణంపల్లి మండలంలోని నలపరెడ్డిపల్లి గ్రామస్తులకు 45 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 118 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో 5 సెంట్లు భూమిని పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. గృహాలు నిర్మించి ఉన్న భూమి మరొకరి పేరు పైన ఉండే విధంగా ఆన్లైన్లో చూపించడం వలన గ్రామ ప్రజల గృహాల విషయంలో రిజిస్ట్రేషన్ చేయుటకు అవకాశం లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనంతరం పై మాఘంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆ గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ నాగరాజు మరియు గ్రామస్తులు కలిసి తహసిల్దార్ సుధాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనంతరం ఎమ్మార్వో త్వరితగతిన స్పందించి గ్రామ ప్రజలను సమస్యను పరిష్కరించడం జరిగింది. అనంతరం గ్రామకంఠం భూమి పత్రాలను వీఆర్వో సురేష్ ద్వారా గ్రామ ప్రజలకు అందజేశారు. గ్రామస్తుల సమస్యలను పరిష్కరించిన ఎమ్మార్వో సుధాకర్ కి వీఆర్వో సురేష్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *