

మనన్యూస్,పినపాక:మండలం దుగినేపల్లి ప్రధాన రహదారిపై లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.ఇద్దరు యువకులు మల్లూరు నుండి మణుగూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మంగపేట మండలం మల్లూరు గ్రామంకు చెందిన వారిగా గుర్తించారు.మృతుడు మాటూరి హనుమంతరావు కొత్త మల్లూరు గ్రామం కు చెందినవాడిగా గుర్తించారు.గాయపడిన వ్యక్తి చర్ల మండలం గీసరెల్లి గ్రామానికి చెందిన మునిగేలా నాగేశ్వరరావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.గాయపడిన వ్యక్తిని మణుగూరు హాస్పిటల్ కి తరలించగా మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.