

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.ఆర్.మధుసూదన్ రెడ్డి
మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:ప్రజల ప్రాణాలతో ఆర్ అండ్ బి అధికారులు చెలగాటమాడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.మణుగూరు నుండి దుగినేపల్లి వరకు ఆర్ అండ్ బి రోడ్డు గుంతల మయంగా తయారు కావడం వలన గుంతల ను తప్పించబోయి పూర్తిగా రైట్ సైడ్ రావటం వలన ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని తరచూ ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అని అన్నారు.ఆ విధంగానే ప్రమాదానికి గురై దుగినేపల్లిలో ఒకరు మరణించి,ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అన్నారు.ప్రమాదానికి గురై ఒకరు మరణించడం ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడం బాధాకరమన్నారు.మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ,వారి కుటుంబానికి తను ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మరణించిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇప్పటికైనా ప్రభుత్వము,ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఆర్ అండ్ బి రహదారిని బాగు చేసి,ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు.