

మన న్యూస్ ,నిజాంసాగర్, జుక్కల్,
ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పులు తీర్చే స్తోమత లేక మద్యానికి బానిసై ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు వెళితే చంద్రమోహన్ అనే వ్యక్తి ఇటీవల అప్పుల భారం ఎక్కువైంది. చేసుకోవడానికి పని లేక చేసిన అప్పులు తీర్చడానికి స్తోమత లేక ఒకవైపు కుటుంబాన్ని పోషించలేక, మరొకవైపు అప్పులు పెరిగిపోవడంతో మద్యానికి బానిసై ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లిన చంద్రమోహన్ స్థానికంగా ఉన్న వ్యవసాయ పొలం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రమోహన్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆదివారం ఓ రైతు బావిలో మృతదేహం కనిపించగా అది చంద్రమోహన్ గుర్తించారు . అప్పుల బాధ భరించలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తల్లి అనుష జుక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుక్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.