మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని దోమకొండ గ్రామానికి చెందిన పోగుల రవి అన్నారు.జనవరి 31తేది 2020 సంవత్సరంలో దోమకొండ గ్రామంలోని పలుగడ్డ కాలనీలో వల్లకాటి నర్సింగ్ నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని,అట్టి విషయం వెంటనే బాలమణికి చెప్పడం జరిగిందని,అన్నారు ప్రతినెల ఇచ్చే రెంటు కూడా నాకే ఇవ్వాలని చెప్పడం జరిగిందని అయినా పట్టించుకోకుండా దోమకొండ పోలీస్ స్టేషన్లో నా పై ఫిర్యాదు చేయడం జరిగిందని,దోమకొండ ఎస్సై బిక్కనూర్ సిఐ దగ్గరికి పంపడం జరిగిందని,సిఐ సమక్షంలోనే 26 అక్టోబర్ 2024 సంవత్సరంలో మాట్లాడుకోవడం జరిగిందని,బాలమణి ఇంట్లో ఉన్నప్పుడు ఖర్చుపెట్టిన డబ్బులు రెండు నెలలలో ఇవ్వాలని చెప్పడం జరిగిందని,ఖర్చు ఎంత అయిందో మాట్లాడుకుందాం అని అంటే కూడా రాలేదని,మూడు నెలలు చూసి నేను ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న ఇంటి సామాగ్రి మొత్తాన్ని ఇంటి ముందు పెట్టడం జరిగిందని తెలిపారు,ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని,నా భార్య మా తల్లిదండ్రులు చనిపోవడం జరిగిందని, నేను నా కొడుకు ఇద్దరం కలిసి మా ఇంట్లో ఉంటున్నామని తెలిపారు,బాలమని ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు మా గ్రామానికి చెందిన కర్ణాకర్ మేస్త్రితో మరమ్మత్తులు చేయించడం జరిగిందని,అదే కరుణాకర్ అయినా లేదా మరో మేస్త్రిని పిలిపించి ఖర్చులు ఇవ్వమంటే ఇస్తానని, నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న నుండి నాకు ఇంటి కిరాయి కూడా ఇవ్వాలని కోరారు.గ్రామపంచాయతీలో కూడా నా పేరు పైనే ఉందని కావాలంటే తెలుసుకోవాలని అన్నారు.నేను డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కోవడం జరిగిందని కనీసం నా కొడుకు నువ్వు చూసైనా మై జాలి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడికైనా తాను అద్దెకు ఉన్నప్పటి ఇంటికి మరమ్మతులు చేపించిన డబ్బులను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *