

Mana News :- కరీంనగర్ జిల్లా : పిభ్రవరి 07, (కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం / కలెక్టరేట్ కార్యలయం ) మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఎమ్మెల్సీ అభ్యర్థి గా పిడిశెట్టి రాజు ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఫమేలా సత్పతి కి నామినేషన్ పత్రాలు దఖాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…. అపర భగీరథుడు జననేత తెలంగాణ రాష్ట్ర తొలి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు గత పదేళ్లుగా హుస్నాబాద్ నుండి కొండగట్టు, వేములవాడ, యాదగిరిగుట్ట నుండి ప్రగతి భవన్ వరకు సైకిల్ యాత్ర చేశామని అన్నారు. గత మూడేళ్లు గా ఇక్కడి నుండి తిరుపతి వరకు సైకిల్ యాత్ర చేస్తున్నానని రాజు పేర్కొన్నారు. అదేవిదంగా రెండు జనరల్ ఎన్నికల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ లు విజయవంతం చేయాలనీ కోరుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ సైకిల్ యాత్ర చేశానని రాజు పేర్కొన్నారు. కేసీఆర్ కి ఇష్టమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులలో నేను ఒకడినని నాకు తప్పకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) మద్దతు ఉంటుందని రాజు ధీమాను వ్యక్తం చేశారు.
