మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, సోయా రైతులు ఎవరూ ఆందోళన చెందకండి చివరి ధాన్యం గింజ దాకా కొనుగోలు చేసే బాధ్యత మాది అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం మూత పడటంతో మద్నూర్,డోంగ్లీ మండలాల రైతుల యొక్క సోయాబీన్ పంట దాదాపు 8 వేల క్వింటాళ్ల దాకా మిగిలిపోయింది విషయం తద్యమే.ఈ విషయంపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలంగాణ మార్క్ ఫెడ్ చైర్మన్,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కలసి వారి దృష్టికి కూడా తీసుకువెళ్లారు.సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది ఐఏఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయగా.వారు సానుకూలంగా స్పందించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని,చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలుచేసేంత వరకు తాను విశ్రమించబోనని రైతులకు తెలిపారు.ఎమ్మెల్యే వెంట మద్నూర్ పిఏసిఎస్ చైర్మెన్ శ్రీను పటేల్,డోంగ్లీ మండల అధ్యక్షులు రాజు పటేల్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *