

మనన్యూస్,గద్వాల:ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహాక కళా ప్రదర్శనకు పూర్తిస్థాయిలో ఉద్యమానికి తోడుంటా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభ్యులు గద్వాల నియోజకవర్గం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాదులో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహాక కళా ప్రదర్శన విజయవంతం కై తనవంతు మద్దతుగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతులమీదుగా ఎమ్మార్పీఎస్ నాయకులకు డప్పులను అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్య శ్రీ మందకృష్ణ హార్దిక శుభాకాంక్షలు మాదిగ ఎస్సీ 59 ఉపకులాలు ప్రజలకు విద్యాపరంగా ఉద్యోగ పరంగా రిజర్వేషన్ లు దక్కాలని, మందకృష్ణ మాదిగ చేపట్టిన ఎమ్మార్పీఎస్ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ కాలం నుండి నేటి వరకు అనునిత్యం పోరాడుతూనే సుప్రీంకోర్టులో విజయం సాధించారని అన్నారు అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ఫలాలు అమలుపరచాలని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నుండి అంబేద్కర్ సచివాలయం ముందు వరకు చేపట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహక కళ మహా ప్రదర్శన విజయవంతం కై నా వంతుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తోడుగా,అండగా ఉంటానని అన్నారు అణగారిన కులాల ప్రజల అభివృద్ధికై భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన న్యాయబద్ధమైన రాజ్యాంగ ఫలాలు అందే వరకు నా వంతుగా కృషి చేస్తానని అన్నారు.అదేవిధంగా గురువారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు కళా ప్రదర్శనలో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు.