మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కేజీవీబీ పాఠశాలలోఉపాద్యాయులకి విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎంవీఐ అమృతవర్షిణి ఏఎంవీఐ సైదా మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు.ప్రతీ ఒక్కరు ట్రాఫి క్ నియమాలు పాటించి సహకరించాలన్నారు.జాగ్రత్తగా రోడ్డు దాటడం,ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం చిన్నతనం నుంచే అలవాటు చేసుకోవాలన్నారు.ప్రయాణ సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలన్నారు.ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల వాహనాలు నడిపే వారు,రోడ్డుపై వెళ్లే వారు క్షేమంగా ఉంటారని చెప్పారు.రహదారి భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గుడ్ సమారిటన్ చట్టం అనేది అత్యవసర పరిస్థితిలో గాయపడిన వ్యక్తికి సహాయం అందించే ఏ వ్యక్తినైనా రక్షించే చట్టం అని వివరించారు.డ్రాయింగ్,వ్యాసరచన,రంగోలీ పోటీలు నిర్వహించారు.మొదటి మూడు విజేతలకు బహుమతులు అందించారు మరియు పాల్గొన్న వారందరికీ పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు.300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ అమృతవర్షిణి ఏఎంవీఐ సైదా,ప్రిన్సిపాల్ అనురాధ,కానిస్టేబుల్ కృష్ణ కుమార్ హోమ్ గార్డ్ ఖాదర్ మరియు ఇతర పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.