మనన్యూస్,మీర్పేట్:ఓ మహాత్మా
ఓవైపు రైతులను,మరోవైపు మహిళలను,ఇంకోవైపు వృద్ధులు,వికలాంగులను,2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను,ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము.దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలు మళ్లీ అవే కష్టాలు,అవే కన్నీళ్లలో చిక్కుకుని విలవిలలాడుతున్న వేళ ఈ దద్దమ్మ సర్కారుకు 420 హామీల్లో కొన్నైనా అమలుచేసే తెలివినివ్వాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాము.
మీర్ పేట్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి నివాళులు అనంతరం వినతిపత్రం సమర్పణ మన జిల్లెలగూడ చందన చెరువు కట్ట పైన ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వారి వర్థంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాజీమంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పట్లోల్ల సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.యస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు అర్కల భూపాల్ రెడ్డి,శ్రీ తీగల విక్రమ్ రెడ్డి,బొక్క రాజేందర్ రెడ్డి, బి.ఆర్.యస్ పార్టీ ముఖ్య నాయకులు దీప్ లాల్ చౌహాన్,యం.ఏ రజాక్,పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి,భూపేష్ గౌడ్,ప్రవీణ్ రెడ్డి,సిద్దాల పెద్ద బీరప్ప,సిద్దాల భారత్,లక్ష్మణ్ ముదిరాజ్,నాయకులు బలరామకృష్ణ,గోపి యాదవ్,మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి,జమాల్పూర్ సునీత బాల్ రాజ్,లత కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *