సుప్రీంకోర్టు 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా

 భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, తాజా మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు పాల్గొన్నారు.సీజేఐగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు. సంజీవ్ ఖన్నా ఎన్నికల బాండ్లు, అధికరణం 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు.

  • Related Posts

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

    సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

    ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?