

తవణంపల్లి జనవరి 28 మన న్యూస్
చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో ఈరోజు పూతలపట్టు ఎంఎల్ఏ మురళీ మోహన్ రాజన్న ఫౌండేషన్ సౌజన్యoతో 25 కోట్ల వ్యయంతోనిర్మించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం అమర్ రాజా విద్యాలయం 8వ వార్షికోత్సవ వేడుకల్లో అమర్ రాజా వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ మురళీ మోహన్ మాట్లాడుతూ గల్లా రామచంద్ర నాయుడు అమెరికా నుంచి వచ్చి వ్యాపార సామ్రాజ్యం సృష్టించి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించి చిత్తూరు జిల్లా అభివృద్ధికి విశేష కృషి నీ అందిస్తున్నారు. అలానే రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రకాల సేవ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పటికే వేలాదిమంది గ్రామీణ యువతకి ఉచిత శిక్షణ అందించి తన కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, ఇప్పుడు దిగివమాగం నందు అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా దిగివమాగం పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత తన నైపుణ్యతను మెరుగుపరచుకోవడానికి, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నాను, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన శిక్షణ ఇప్పించడం జరుగుతుంది, స్థానిక నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ కోరుకుంటున్నాను మరియు పిల్లలు చదువులతో పాటు క్రీడలు, సంస్కృతి కార్యక్రమాలు మరియు ఇతర రంగాల్లో జ్ఞానాన్ని పెంచుకొని భవిష్యత్తులో మంచి వృత్తిలోకి వచ్చి రాష్ట్రానికి అదే విధంగా దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ” *ఇప్పటికే పీటమిట్ట నందు గల అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వేలాదిమంది గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దిగభాగం నందు రెండవ బ్రాంచ్ నీ ప్రారంభించుకోవడం జరిగింది మరియు పిల్లలు చదువులతో పాటు అన్ని రంగాలలో తమ ప్రతిభను మెరుగుపరచుకొని అభివృద్ధిలోకి రావాలని కొనియాడారు మరియు గ్రామీణ పిల్లలకి అత్యాధునిక సదుపాయాలతో విద్యను అందించాలని దృక్పథంతో డిజిటల్ ఎడ్యుకేషన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కావున ఈ అవకాశాన్ని సమీప గ్రామీణ పిల్లలు మరియు నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యతను పెంచుకోవాలని కోరుతున్నాను”* అని అన్నారు.ఈ కార్యక్రమంలో అమర రాజా విద్యాలయం విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 600 మంది వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలలో అల్లరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజన్నా ఫౌండేషన నిర్వాహకులు రాళ్ళపల్లి సతీష్, డీన్ రవికుమార్, అమర రాజ హెచ్ఆర్ సీనియర్ జనరల్ మేనేజర్ నలినీ కుమార్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ ,డిప్యూటీ జనరల్ మేనేజర్ ధనంజయ నాయుడు,అమర రాజ విద్యాలయం ప్రిన్సిపాల్ జయశ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
