

మనన్యూస్,కామారెడ్డి: రాజంపేట మండల కేంద్రంలో జూకంటి మోహన్ రెడ్డి పలువురి భూములను కబ్జా చేసినట్టు గ్రామానికి చెందిన రైతులు తెలిపారు.జూకంటి మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం నాకు కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని మీడియా సమావేశంలో తెలిపారు.అతను చెప్పిన విషయాలు అవాస్తవమని ముత్యం సిద్ధిరాములు,వీరన్న పటేల్,పిట్లా శ్రీను,జూకంటి రాజారెడ్డి,రామకృష్ణారెడ్డి,అన్నారు రాజంపేట గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ జూకంటి మోహన్ రెడ్డి సర్వే నెంబర్ 576 మరియు 569 లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకుని వారి కుటుంబ సభ్యుల పేరున మార్చుకొని వాటిపైన పాసుబుక్కులు తీసుకొని రైతుబంధు మరియు రుణమాఫీ కూడా పొందుతున్నాడు ఇంకా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా కబ్జా చేయడం జరిగిందన్నారు.అతనికి 1984లో ఎంత భూమి ఉన్నది ఇప్పుడు ఇంత భూమి ఏ విధంగా వచ్చిందో అధికారుల ద్వారా ఎంక్వయిరీ చేయించి అట్టి భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు రద్దుచేసి వాటి నుండి లబ్ధి పొందిన రైతు బంధు మరియు ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అతని నుండి రికవరీ చేయగలరని మరియు కాలేశ్వరం ప్రాజెక్టు కాలువ ప్రభుత్వ భూమి నుండి పొగ అట్టి భూమిపైన కూడా అప్పటి ప్రభుత్వం అండతో పథకాలు కూడా లబ్ధి పొందినాడు.జూకంటి మోహన్ రెడ్డి పైన సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 1993 లో సర్వేనెంబర్ 637 లో రెండు ఎకరాల భూమిని రాజంపేట గ్రామం నుండి డబ్బులు తీసుకుని విరాళం రూపంలో జూకంటి మోహన్ రెడ్డి మరియు పదిమంది కలిసి సబ్ రిజిస్టర్ దోమకొండలో డిఎంహెచ్ ఓ నిజామాబాద్ గారి పేరున రిజిస్టర్ చేయనైనది. ఆ స్థలంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టగా మిగులు భూమి 12 గుంటల స్థలం జూకంటి మోహన్ రెడ్డి కబ్జా చేసుకొని చందపు.సత్యనారాయణ రెడ్డి s/o శంకర్ రెడ్డి R/o రామయంపేట్ పేరున డాక్యుమెంట్ 220 /2000 లో దోమకొండలో రిజిస్ట్రేషన్ చేసినాడు.అట్టి స్థలం గురించి గ్రామస్తులు ఎదిరిస్తే అప్పటి ప్రభుత్వ అండతో వారి పైన కేసులు పెట్టడం జరిగింది.ఆంజనేయ శర్మ పేరున 6.03 ఎకరాలు పాస్ బుక్కు చేయించి రైతుబంధు పొందుతున్నారు భూమి లేదు పాసుబుక్ ఎలా వచ్చింది జూకంటి మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం పేరున 13 ఎకరాలు ఎలా వచ్చింది. జూకంటి గీత పేరున 4.21 భూమి ఉంది.మేము చూసినప్పుడు వాళ్ల తల్లి మోహన్ రెడ్డి కూలి పని చేసుకొని బతుకుతెరువు సాగించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించారు.పేదలను రైతులను బెదిరిస్తూ ప్రభుత్వ అండదండలతో పాసుబుక్కులు తయారు చేయించుకొని రైతుబంధు భూమి లేకుండా ఉన్నట్లుగా బ్యాంకులలో లోన్లు తీసుకొని ఎవరైనా ఎదురు తిరిగితే అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో కొట్టించారు.ప్రభుత్వ అధికారులు సమగ్రంగా విచారణ జరిపి కబ్జా చేసినటువంటి భూములను ప్రభుత్వం తీసుకొని పేదలకు ఇవ్వాలని రైతుల భూములను రైతులకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.ప్రభుత్వాన్ని మోసం చేసి ఇప్పటివరకు కాజేసిన డబ్బులను రికవరీ చేయగలరని అధికారులను కోరుతున్నామన్నారు.గ్రామస్తులు బెస్త చంద్రం భూమలింగం ,గుర్రాల రాము, ప్రవీణ్, సాధుల, బల్ల కిషోర్, నరేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.