

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ కోరారు.మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఎమ్మెల్సీ ఎన్నికలకు పనిచేసే విధానం,ఓటింగ్ సరళి,ఓటింగ్ ప్రాధాన్యత క్రమం,ఓటర్ల వివరాల సేకరణ,ఎన్నికల ప్రచార నిర్వహణ వంటి అంశాలుపై నియోజవర్గ శ్రేణులకు అవగాహన కల్పించారు.ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని,తన గెలుపు కోసం కూటమి శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు.జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ రాజశేఖర్ విజయం తధ్యం అన్నారు.కార్యక్రమంలో బిజెపి నియోజక వర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్తిరాజు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.