

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ బాలిక దినోత్సవం ను ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ,ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని,పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారని వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందని . అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం చాలా అవసరమని తెలియజెశారు. అదే విదంగా బాల్య వివాహాలు నిర్మూలించాలని, బాల్య బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. తల్లిదండ్రులు, సంరక్షుకులు, పురోహితులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, బాల్య వివాహానికి అనుమతించిన కులపెద్దలు, వివాహ ఏర్పాట్లకు సహకరించిన వారందరూ నేరస్థులే.పెళ్లికి హాజరైనవారు కూడా నేరస్థులవుతారని తెలియసేశారు.ఈ కార్యక్రమమలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ మాట్లాడుతూ ఎదిగే హక్కు బాలుడు తోపాటు బాలికకు సమానంగా ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలుకావడం లేదు.తల్లిగర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షను తొలగించి, వారి సమగ్రాభివృద్దే లక్ష్యంగా 2008 నుంచి ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికాదినోత్సవం జరుపుకుంటున్నాం.ఆడమగ అనే తేడా లేకుండా అందరూ సమానమే భావనతో బ్రతకాలని, ఆడపిల్లలను గౌరవిస్తూ వారి పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు , ఏలేశ్వరం పట్టణ వీడుల్లో విద్యారులందరూ ర్యాలీని నిర్వహించి స్లోగాన్స్ ఇస్తూ బాలాజి చౌక వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందని.అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న. ఆడమగ అనే తేడా లేకుండా అందరూ సమానమే భావనతో బ్రతకాలని, ఆడపిల్లలను గౌరవిస్తూ వారి పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు ,ఏలేశ్వరం పట్టణ వీడుల్లో విద్యారులందరూ ర్యాలీని నిర్వహించి స్లోగాన్స్ ఇస్తూ బాలాజి చౌక వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అద్యపకులు వి.రామరావు , కె . సురేశ్, శివప్రసాద్,వీరభద్ర రావు, ఎస్‌కే మదీనా, శ్రీ లక్ష్మి , కె బంగార్రాజు,మేరి రొసిలిన, పుష్పా, సతీశ్, మరియు అద్యపకేత సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు.