

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం :జిల్లాలో భారతీయ జనతా పార్టీ బిక్కిన విశ్వేశ్వరరావు రాకతో మరింత బలోపేతం కాగలదని, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో బలమైన సామాజిక వర్గం కలిగి ఉన్న బిక్కిన విశ్వేశ్వరరావు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కావడం హర్షనియం అన్నారు. ఇప్పటికే ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ కమిటీలు వేయడం జరిగిందన్నారు. గ్రామాలలో బిజెపి బలపడుతోందని, నూతనంగా ఎన్నికైన విశ్వేశ్వరరావు రాకతో మరింతగా బిజెపి క్యాడర్ బలపడుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు.బిజెపి నాయకులు ఉమ్మిడి వెంకట్రావు సారధ్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్టీ బలపడేందుకు కార్యకర్తలంతా క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుని కలిసిన వారిలో ఉమ్మిడి వెంకట్రావు తో పాటు బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ కర్రి ధర్మరాజు, హరే రామ్,ప్రతిపాడు మండల అధ్యక్షుడు ఊటా వీరబాబు, బూత్ అధ్యక్షుడు వీర వెంకట సత్యనారాయణ, బ్రహ్మాజీ, వెంకన్న, నాని పల్లి శ్రీనివాస్, గోపి, దొడ్డిపట్ల సుబ్బరాజు, ప్రత్తిపాడు మండల బిజెపి నాయకులు గోపుఅబ్బులు, గుద్దటి వెంకటరమణ, కడారి నాగేశ్వరరావు,గొల్లగాని వీరబాబు, రమణ, నాగేశ్వరరావు, భాస్కరరావు, సూర్యనారాయణ, సతీష్, కృష్ణ బాబు, ఆనంద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.