

- ఎవరు కూడా అదైర్యాపడొద్దు
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా
మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 20:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ, చివరి లబ్ధిదారుల వరకు రేషన్ కార్డుల జారీ చేస్తుందని ఈ విషయమై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రేషన్ కార్డు రాని కుటుంబాలు ఉంటే ఎవరు కూడా ఆందోళన, చెందద్దని, గ్రామాల్లో వస్తున్న వాదంతులను ఎవరు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ పేదల పక్షన ఉండే పార్టీ అని నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని ఇప్పటికే జిల్లా యంత్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ కృషితో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని నిజమైన లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేస్తామన్నారు.