- 30 సీసీ కెమెరాలు నాలుగు డ్రోన్ కెమెరాలు సిఐ హనుమంతప్ప పర్యవేక్షణ
- వేలదిమంది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
- పొంగల్లు పెట్టి పొట్టేళ్లు బలిచ్చే ముక్కులను చెల్లించుకున్న భక్తులు
మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ఈ సంక్రాంతి ఉత్సవాలు ప్రతిఏటా నిర్వహిస్తారు అమ్మవారిని దర్శించడానికి లక రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు భారీ ఎత్తున పాల్గొని పొంగళ్ళు పెట్టి మేకపోతు ను బలి ఇచ్చి మొక్కను చెల్లించుకున్నారు.

భక్తులకు ఎలాంటి అవాన్ నా అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణలో 30 సీసీ కెమెరాలు నాలుగు డ్రోన్ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు కలగకుండా మెడికల్ క్యాంపు ను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించడానికి భారీ ఎత్తున భక్తులు పొటేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పైనేని ధనుంజయ, ఆలయ ఈవో తిమ్మారెడ్డి ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్, కార్వేటి నగరం ఎస్సై రాజకుమార్, పాలసముద్రం ఎస్సై చిన్న రెడ్డప్ప, పైనేని మురళి, బిల్డర్ గంగాధరం తయ్యూరు పాయకట్టు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
