మన న్యూస్.సాలూరు: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు కోటి రూపాయలు విలువ గల గంజాయిని పట్టుకున్న పోలీసులు,పాచి పెంట ఎస్సై వెంకటసురేసు సిబ్బందితో గంజాయి అక్రమ రవాణా గురించి రాబడి సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా వివిధ బృందాలుగా విభజించి మాతమూరు గ్రామ కూడలి వద్ద మరియు వేటగాని వలస జంక్షన్ వద్ద ఉదయం 6 గంటలనుండి వాహన తనిఖీలు నిర్వహించగా OD10P5913.AP39AE9526 అను నెంబర్లు గల రెండు బొలెరో వాహనాలు అరకు వైపు నుండి సాలూరు వైపు వస్తున్న వాహనాలు తనిఖీ చేయగా వారిని చూసి తప్పించుకున్నట్టు ప్రయత్నించారు ఎస్సై వారి సిబ్బంది వారి వెంట వెంబడించి రెండు వాహనములు మరియు ఆరుగురు ముద్దాయిలను పట్టుకొని వాహనముల తనిఖీ చేయగా వాటిలో 300 ప్యాకెట్స్ తో సుమారు 671 కేజీ గంజాయిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6సెల్ ఫోన్లు స్వాధీనుపరుచుకున్నారు. ఈ గంజాయి రవాణాకు ప్రథమ సూత్రధారి అయిన పడవు గ్రామ నివాసి అయిన కిసాన్ ప్రస్తుతం పరారీ లో ఉన్నారు ప్రస్తుతం ఈ గంజాయి విలువ 80 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు ఉంటుందని మన్యం ఎస్పీ మాధవ రెడ్డి చెప్పారు
సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ పాచిపెంట ఎస్సై వెంకటసురేష్ వారి సిబ్బందికి రివార్డ్స్ ఇవ్వాలని ఏ ఎస్ పి కి రెకమండ్ చేసిన ఎస్పి మాధవ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *