మన న్యూస్,తిరుపతి: తిరుపతి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో శ్రీ జగద్గురు సేవా సమితి ముందంజలో ఉంటుందని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి ధన్వంత్ కుమార్, తేలిపారు.ఆదివారం శ్రీ జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో అందులకు పండ్లు బిస్కెట్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ పంపిణీ కార్యక్రమానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఉదయభాను,తిరుపతి బ్యాంక్ ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని పండ్లు,బిస్కెట్లను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ధన్వంత కుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టడం శ్రీ జగద్గురు సేవా సమితి ఎంతో అభినందనీయమని కొనియారు.ఈ సేవా సమితి ఆధ్వర్యంలో పురాతన దేవాలయాలను మరమ్మత్తులు చేయడం వాటికి రంగులు వేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుట్టిందన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీ జగద్గురు సేవా సమితి అధ్యక్షులు మోహనరామిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ దాతల సహకారంతోనే అందులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.తాము ఏర్పాటు చేసిన సేవ సమితి పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా ప్రారంభించామని మోహనరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగద్గురు సేవా సమితి సభ్యులు విశ్వనాథ్,చంద్రశేఖర్ గోవిందరెడ్డి, సందీప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *