

మన న్యూస్,పీర్జాదిగూడ: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ లో రాయ భారపు రవిరాజ్,చేపురి సాయి కిరణ్ నేతృత్వంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన శ్రీ కేఫ్ రాయ ను ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్,స్థానిక కార్పొరేటర్ కౌడ పోచయ్య, హాజరయ్యారు.అనంతరం శ్రీ కేఫ్ రాయ యాజమాన్యానికి మేయర్ అమర్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ శ్రీ కేఫ్ రాయలో అన్ని రకాల టీ, కాఫీ లు, స్నాక్స్ మిక్స్ చెట్టు అందరికి అందుబాటు ధరల్లో లభిస్తాయి అన్నారు. అంతేకాకుండా యువత ఆహ్లాదంగా కూర్చొని టీ,కాఫీ ని ఎంజాయ్ చేయవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడ పోచయ్య,సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్, కాలనీ వాసులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.