

మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లోని
పోచమ్మ టెంపుల్ పక్కన ఏఎన్ఆర్ రెసిడెన్సి గ్రౌండ్ ఫ్లోర్లో మహేష్ మాగ్నస్ పై నెట్వర్క్ గ్యారేజ్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో మహేష్ మాగ్నస్ కన్సల్ట్ ఓనర్ మహేష్,తెలంగాణ స్టేట్ హెడ్ ఎం రవి కుమార్ సుందర్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఫేస్బుక్వె,రిఫికేషన్,ఈమెయిల్ వెరిఫికేషన్,లాక్ అప్ పోర్షన్,సెక్యూరిటీ సర్కిల్,వాలెట్ జనరేషన్, కె వై సి,మైగ్రేషన్,టోటల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సర్వీసులు తాము అందిస్తామని తెలిపారు.విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ ప్రారంభించామని,తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ రెండో బ్రాంచ్ అని,త్వరలో బెంగళూరులో మూడో బ్రాంచ్ ప్రారంభిస్తామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవంలో బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.