మన న్యూస్:ఎల్ బి నాగర్.జెండర్ మనసుకు సంబంధించినది జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ఆడ,మగ అనేవి భౌతిక పరమైన అంశాలు కావని,జెండర్ అనేది మనసుకు సంబంధించినదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి అన్నారు.ట్రాన్స్ జెండర్ల సమస్యలు- హక్కులు అనే అంశంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో లింగ వివక్ష ఇప్పటివరకూ మహిళలపైనే కొనసాగిందని, ఇప్పుడూ ట్రాన్స్ జెండర్లు కూడా ఈ జాబితాలో చేరిపోయారన్నారు.వివక్షను చట్టాలెప్పుడూ సమర్థించవన్నారు.ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణకు ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ యాక్టు ఏర్పాటయిందన్నారు.అనంతరం మెట్రొపాలిటన్ సెషన్స్ జడ్జి పట్టాభి రామారావు ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ యాక్టు వివరించారు.అనంతరం క్యూ టీ సెంటర్ నిర్వాహకులు ఆదిత్య మాట్లాడుతూ జెండర్ అనేది క్రోమోజోములు, హార్మోనల్ ఇంబాల్యన్స్ కి కూడా సంబంధించినది కాదన్నారు రచన,వైజయంతి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు కర్ణాటక లో మాదిరిగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.ప్రత్యేక హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పొన్న శ్రీదేవి,అదనపు జిల్లా న్యాయమూర్తులు,సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు,కార్యదర్శి, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.








