

మనన్యూస్:మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ మిష్టర్ బాయి నిజాంసాగర్,జుక్కల్ యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కల్గి ఉండాలనే సదుద్దేశ్యంతో వల తో పట్టడం అనుకుంటున్నారా కాదు పప్పులో కాలేసినట్లే టాగ్గోస్ ద్వారా పట్టి వారికి మాత్రమే అని హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ మిష్టర్ బాయి చేపల వేట ఫిస్సింగ్ కాంపిటేషన్ ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ
యువత క్రీడా రంగాల్లోనే కాకుండా చేపల వేటలో కూడా రాణించాలని స్పోర్ట్స్ మాదిరి ఒక రకమైన హాబి కల్గి ఉండాలని అన్నారు.ఇదివరకే జూరాల ప్రాజెక్టులో చేపల వేట పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.ఈ పోటిలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పాల్గొనా వచ్చునని తెలిపారు.ఈ పోటిలలో పాల్గొనెందుకు ఆసక్తి గల వారు రూ.1500 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ముగ్గురుని కలిపి ఒక టీం ఏర్పాటు చేయనున్నారు. పోటిలలో చేపల బరువు బట్టి గెలుపును నిర్ధరిస్తామని తెలిపారు.గెలుపొందిన టీం కు బహుమతిగా రూ.ఒక లక్ష రూపాయలు,ట్రోపి అందజేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది జనవరి 20 వరకు మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ (మిష్టర్ బాయి) పూర్తి వివరాలకు సెల్ 7995926581 సంప్రదించాలని కోరారు. అన్ని రంగాలలో యువకులు యువత ముందుండాలని సదుద్దేశంతో చేపలు పట్టే వారిని కూడా స్పోర్ట్స్ లో చేర్చాలని ఉద్దేశంతో చేపలను పట్టే కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మహ్మద్ కరమత్ అలీ, మహమ్మద్ అబ్దుల్ రఫిక్ ,మహమ్మద్ అష్షు ,మహ్మద్ యాసిన్,అహ్మద్ అత్తర్ ఒద్దిన్,హేమంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు
