మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని 8వ వార్డులో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా,వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్‌ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను, అర్హత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *