తవణంపల్లి: నంబరు 12 మన ద్యాస
తవణంపల్లి మండల పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండో విడత (రౌండ్ -2) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లలకు అందించాల్సిన సేవలు, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పలు అంశాలను వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ , హెచ్ .ఏం ., ఐసీడిఎస్ప సూపర్వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *