రేణిగుంట, నవంబర్ 13.
ఏపీఎస్పీడీసీఎల్ ( ఏపీఎస్ పి డి సి ఎల్ ) రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని పలు సబ్ స్టేషన్లలో విద్యుత్ లైన్ల నిర్వహణ మరియు చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ కటింగ్) పనుల కారణంగా, రేపు శనివారం (14.11.2026) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఆపరేషన్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( డి ఈ ఈ ) వి. రమేష్ బాబు తెలిపారు.
విద్యుత్ అంతరాయం కలిగే ప్రాంతాలు (సబ్ స్టేషన్ల పరిధి):
33/11కేవీ తుకివాకం సబ్ స్టేషన్
33/11కేవీ కరకంబాడి సబ్ స్టేషన్
33/11కేవీ గురవరాజుపల్లి సబ్ స్టేషన్
33/11కేవీ యెలమండ్యం సబ్ స్టేషన్
33/11కేవీ గాజులమండ్యం సబ్ స్టేషన్
33/11కేవీ కుర కాలువ సబ్ స్టేషన్
పై సబ్ స్టేషన్ల పరిధిలోని 11కేవీ మరియు ఎల్ పి లైన్లకు ఆటంకంగా ఉన్న చెట్లను తొలగించే పనుల నిమిత్తం, శనివారం ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంతరాయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులందరూ తగు సహకారం అందించాలని వి. రమేష్ బాబు కోరారు
