రేణిగుంట మండల స్థాయి నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్షా సమావేశంప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపుఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండల స్థాయి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కమిటీల సన్నద్ధత, ఓటర్ల జాబితా పరిశీలన మరియు ఎన్నికల వ్యూహాలపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనందరికీ అత్యంత కీలకమని, మండలంలోని ప్రతి ఎంపీటీసీ స్థానంతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయడమే మన లక్ష్యమన్నారు.ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు అంతర్గత విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో, ఐక్యమత్యంతో పనిచేయాలి అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రేణిగుంట కూటమి మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ ఎంపీటీసీ అభ్యర్థులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


