వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలుచోట్ల మొక్కలు నాటిన క్లబ్ సభ్యులు.

మన ధ్యాస, మక్తల్:వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (అంతర్జాతీయ అధ్యక్షులు ) సౌభాగ్య సేవాసంకల్ప కే సి జి ఎఫ్ శిద్దా వెంకట సూర్య ప్రకాష్ రావు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పలుచోట్ల మొక్కలు నాటినట్లు వాసవీ క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరిక్రిష్ణ తెలిపారు.తొలుత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి, అనంతరం స్థానిక మక్తల్ పట్టణం ప్లే గ్రౌండ్ ఎంపీపీ ఎస్ పాఠశాల, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం , వాసవి మాత దేవాలయం వద్ద పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. వాసవి క్లబ్ మాజీ డిప్యూటీ గవర్నర్ కల్వ శ్రీనివాస్, సంఘ పెద్దలు మాట్లాడుతూ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతి క్లబ్బు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని, అందులో భాగంగా మక్తల్ పట్టణంలో మొక్కలు నాటడం జరిగిందని, డోనర్లు వైశ్యులు ఉంటారని సేవా మాత్రం అన్ని వర్గాల ప్రజలకు బీదవారికి మా వాసవి క్లబ్ తరఫున చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మేడిశెట్టి హరికృష్ణ మాట్లాడుతూ, చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, చెట్లుగా మారే వరకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మాజీ డిప్యూటీ గవర్నర్ కల్వ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు బిలకంటి నరసయ్య, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మనసాని వెంకటేష్,వాసవి సభ్యులు తాలంపల్లి రవికుమార్, ఎంఈఓ అమిరుద్దీన్, కార్యదర్శి ఆంజనేయులు,ఎమ్మార్సీ కోఆర్డినేటర్ గౌడంపల్లి శ్రీనివాస్, ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *