ఉదయగిరి, సెప్టెంబర్ 11, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

ఉదయగిరి హస్తకళాకారుల సమస్యలను తెలుసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో, జనసేన రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.12 లక్షలు మంజూరు చేయించడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌ను సందర్శించి, కళాకారుల సమస్యలను తెలుసుకున్నారు. నిర్వాహకులు శ్రీ జకీర్ హుస్సేన్ గారిని, వారి తల్లిగారిని సత్కరించారు.అనంతరం జకీర్ హుస్సేన్ గారు శ్రీ లింగమనేని రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సెంటర్‌లో తయారు చేసిన చెక్క వస్తువులతో కూడిన గిఫ్ట్ బాక్స్‌ను అందజేశారు.ఈ సెంటర్‌పై ఆధారపడి సుమారు 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మౌలిక వసతులు, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.హస్తకళాకారుల సంక్షేమం కోసం జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *