filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 6; shaking: 0.000000; highlight: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0045,0.0000; brp_del_sen: 0.1500,0.0000; delta:1; bokeh:1; ispap:1; papproctime: 2026:09:10 13:10:56; module: photo;hw-remosaic: false;touch: (0.3630552, 0.5634603);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 223.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 36;

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి, బాన్సువాడ డీఎల్‌పీవో ప్రసాద్‌రావు అన్నారు.మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ఆయా శాఖల ద్వారా గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలను వెల్లడించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీఎల్‌పీవో సూచించారు.
ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సూచించారు.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని డీఎల్‌పీవో ప్రసాద్‌రావు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో ఎంపీడీవో అనిత, తహసిల్దార్ లతా, సూపర్ వైజర్ లత, ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి,
నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ ,సర్పంచుల పూర్వ అధ్యక్షులు రమేష్, సర్పంచులు రఫీ ,సుమయ, ధపెదర్ బాలమణి, కుమ్మరి రాములు ,బోయిని హరీణ్ కుమార్, బండారి లక్ష్మి, సాయి కిరణ్, గజ్జల జీవన్,తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *