మన ధ్యాస, మక్తల్:వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీ గుప్తా జన్మదినం పురస్కరించుకొని గురువారం మక్తల్ పట్టణంలోని ఆనంద నిలయం లోని విద్యార్థులకు వనితా క్లబ్ ఆధ్వర్యంలో బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా వనితా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న మాట్లాడుతూ, కేసీ గుప్తా జన్మదినం పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పద్మ, అగ్లర్ రేఖ, రూప, భాస్కర్ సార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.