మన ధ్యాస, మక్తల్: గురువారం పట్టణంలోని అయ్యప్ప కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయ్యప్ప డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ అనంతరెడ్డి మాట్లాడుతూ,విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని గొప్ప ఫలితాలు సాధించాలని,విద్యార్థులు జీవితం లో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని గొప్ప ఫలితాలు సాధించాలని అన్నారు. పట్టభద్రులు గా సమాజం లో బాధ్యత గా మెలగాలన్నారు.మారుతున్న విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచుకునే విధంగా కృషి చెయ్యాలన్నారు..సాంకేతికత కి మానవీయ విలువలు జోడించి ఉత్తమ పౌరులుగా మెలగాలని తెలిపారు. ఈ దేశ భవిష్యత్ ఈ తరపు యువత ఆలోచనల్లోనే ఉందని గుర్తుచేశారు. అనంతరం కళాశాల నుండి గ్రాడ్యుయేట్లు గా ఉత్తీర్ణత సాధించిన 63 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రధానం చేశారు.కార్యక్రమం లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి..ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, గోవర్ధన్, నవీన్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.