,
మన ధ్యాస, నెల్లూరు, జూలై 19 : భారతీయ మజ్దూర్ సంఘ్, నెల్లూరు జిల్లా కమిటి ఆధ్వర్యంలో నెల్లూరు, మిని బైపాస్ రోడ్డు జిపిఆర్ కళ్యాణ మండలంలో శనివారం అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడినది. ఈ ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలందించిన మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్, కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆయుష్ వైద్య విభాగం, ప్రభుత్వ ఆసుపత్రి మేనేజ్మెంట్, మరియు జయభారత్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చిన వారిని పరీక్షించి మందులు ఉచితంగా అంద చేశారు. ఈ సందర్భంగా భారత మజ్దూర్ సాంగ్ వారు మాట్లాడుతూ……..అసంఘటిత కార్మికుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మా అభ్యర్థనను వెంటనే స్వీకరించి ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి కి భారతీయ మజ్దూర్ సంఘ్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు.అదేవిధంగా, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఎంతో అంకితభావంతో, సమష్టిగా కృషి చేసి ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన భారతీయ మజ్దూర్ సంఘ్ నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. జిల్లా కమిటీ సభ్యుల సేవాభావం, కృషి మరియు సమన్వయం ఈ కార్యక్రమం విజయానికి ప్రధాన కారణమైంది….మీ అందరి సహకారం వల్ల వందలాది మంది అసంఘటిత కార్మికులు ఉచిత వైద్య సేవలను పొందగలిగారు…. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలకు మీ అమూల్యమైన సహకారం కొనసాగాలని ఆకాంక్షిస్తూ, మరోసారి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని తెలియజేశారు.



