కలిగిరి , అక్టోబర్ 31: మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కలిగిరి ఎంపీటీసీ బిట్‌–2 తెలుగుదేశం పార్టీ (కూటమి) అభ్యర్థి బండారు మల్లికార్జున తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. దీంతో కలిగిరి ఎంపీటీసీ బిట్‌–2 పరిధిలో ఎన్నికల సందడి నెలకొంది.ప్రచారంలో భాగంగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు, తెల్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి బిజ్జం కృష్ణారెడ్డి బండారు మల్లికార్జునకు మద్దతుగా కలిగిరి మసీదు వీధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుంటూ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేపట్టారు.మల్లికార్జున ప్రజల తో మమేకమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుని, రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని వివరిస్తున్నారు.ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను గుర్తించి సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.బిట్–2 పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మల్లికార్జున భరోసా ఇచ్చారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, వారి సలహాలు, సూచనలతో ముందుకు సాగుతానని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పుల్ల వెంకటేశ్వర్లు, బాబీ, హజరత్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అభ్యర్థికి మద్దతుగా పార్టీ శ్రేణులు ప్రచారంలో భాగస్వాములవుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *