• కూటమి వ్యతిరేక పాలనపై ప్రజల పక్షాన పోరాడుతాం*!
  • సూపర్ యాప్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్..

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 19 :వైసీపీలో ప్రతి నాయకుడికి కార్యకర్తకు జగన్ 2.0 సూపర్ యాప్ కొండంత అండగా నిలవనుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట నారా లోకేష్, చంద్రబాబు వైసిపి నేతలపై చేస్తున్న కక్షపూరిత అరెస్టులు, వేధింపులు ప్రజలు గమనిస్తున్నారన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కును తండ్రి కొడుకులు కాల రాస్తున్నారని మండిపడ్డారు.ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో వైసిపి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అండదండలతో ప్రతి నాయకుడు కార్యకర్త ప్రజల పక్షాన నిలబడతామన్నారు.సోషల్ మీడియాలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్ను లక్ష్యంగా చేసుకుని అణిచి వేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో,పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి ఈ సొంత డిజిటల్ వేదిక రూపుదిద్దుకుందని తెలిపారు.ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రా యాన్ని వ్యక్తపరచడానికి,పార్టీతో నేరుగా అను సంధానమై ఉండేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.రాజకీయ వేధింపులు, పోలీస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు డిజిటల్ డైరీ ద్వారా నేరుగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే సౌకర్యాన్ని ఈ యాప్లో కల్పించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక సమ స్యలపై నాయకులు తక్షణమే స్పందించి,ప్రజలతో మమేకం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బిపిన్ జైన్,పచ్చిరిపిల్లి రాము,వార్డ్ ప్రెసిడెంట్ పీతల వాసు,దస్మంతుల మాణిక్యాలరావు,జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు,జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర,జిల్లా ఎస్సె.సి సెల్ వైస్ ప్రెసిడెంట్ కోనశంకర్,జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ చోడిపిల్లి శివ,సౌత్ యూత్ ప్రెసిడెంట్ తాడి రవితేజ,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ,సౌత్ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ మల్ల విజయ్,సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవార మహేష్, సౌత్ SC సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్,నోళ్లు చంటి, రూప, మాదాబత్తుల రమేష్,పులి,మాడుగుల నారాయణమూర్తి సీనియర్ నాయకులు,మహిళా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *