శ్రీకాళహస్తి, జులై 19: ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై, అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ఎ . గంగాదేవి అనే నిరుపేద మహిళా లబ్ధిదారుడి కుటుంబ పరిస్థితిని బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి. అమర్ నాథ్ పరిశీలించారు. ఆపరేషన్ నిమిత్తం సదరు నిరుపేద కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గ్రహించిన జి.వి. అమర్ నాథ్ , బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగాదేవి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరియు వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన అమర్ నాథ్ , ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్ ) ద్వారా సదరు కుటుంబానికి గరిష్ట ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపాలని, వారిని ఆదుకోవాలని శాసనసభ్యులను కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *