రేణిగుంట, జులై 19: రేణిగుంట మండలం వెదలచెరువు గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి మరియు వారి కుమార్తె కాటంరెడ్డి పవిత్రరెడ్డి బియ్యపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రముఖులు హరిప్రసాద్ రెడ్డి, గిరి, సుదర్శన్ రెడ్డి, గురవయ్య, చెంగళ్రాయులు, మల్లికార్జున, వేణు, మోహన్, కిషోర్, కేశవులు, దిలీప్, ఉమ శంకర్, సుబ్రమణ్యం, శేషాద్రి, యోగానంద్, కృష్ణయ్య, లోకానాథ్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.




