మన ధ్యాస నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్యాధికారి డా. వెంకటి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, ఆసుపత్రి రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రత, వార్డులు, వివిధ విభాగాలను తనిఖీ చేసి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు,సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. రోహిత్ కుమార్ తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *