

మన న్యూస్:కామారెడ్డి జిల్లా :ఓ సినీ నటుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన మరవకముందే మరో సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది మొహమ్మద్ రఫిక్ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో డీఎస్పీ దగ్గరికి పరిచయం నిమిత్తం వెళ్తే నీవు ఎవరైతే నాకేంటి రా… అంటూ దుర్భాషలో మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తిని ఎక్కించపరచడం జరిగిందని కామారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఖండించింది అనంతరం అడిషనల్ ఎస్పీకి, డి.ఎస్.పి పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.