వలస ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

అడవిరామవరం గుత్తికోయ గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్గ్రా మంలోని 35 కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన పోలీసులు

మన న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి చంద్రభాను సూచనలతో గుండాల పోలీసుల ఆధ్వర్యంలో అడవిరామవరం గుత్తి కోయ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను లు పాల్గొన్నారు.ఆళ్లపల్లి మండలం అడవిరామవరంలో చత్తీస్గడ్ రాష్ట్రం నుండి వలస వచ్చి కొన్నేళ్ళుగా నివాసముంటున్న ఆదివాసీలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలియజేసారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామంలో నివసించే కుటుంబాలకు వైద్య బృందంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ముందుగా ఆళ్లపల్లి మీదుగా మర్కోడు చేరుకొని అక్కడ నుండి ద్విచక్ర వాహనాలపై దట్టమైన అటవీ ప్రాంతంలో నుండి అధికారులు అడవిరామవరం గ్రామానికి చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న ఎస్పీ ముందుగా గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం గ్రామ ప్రజలకు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్, గుండాల పోలీస్ వారి సహాకారంతో దుప్పట్లు,సోలార్ లైట్లను, నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వలస ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం పోలీస్ శాఖ ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలోని యువత,పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి మెరుగైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు.మావోయిస్టులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని ఆదివాసి ప్రజలను కనీస సౌకర్యాలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత మావోయిస్టులకు మనుగడ లేక మావోయిస్టు పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని తెలియజేశారు.ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీసు అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 120 మంది గ్రామ ప్రజలకు ఏర్పాటు చేసిన సహాపంక్తి విందులో అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గుండాల సీఐ రవీందర్, టేకులపల్లి సీఐ సురేష్, ఎస్సైలు రాజమౌళి,రతీష్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.వైద్య సేవలు అందించడానికి వచ్చిన వైద్యురాలు సంఘమిత్ర సుదీప్బృం దానికి, ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు సొందు పాషా కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన