

మన న్యూస్:పినపాక,నియోజకవర్గం సింగరేణిలో భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో అధికారులకు హెచ్ డేవిడ్ రాజు సహాయ ప్రాజెక్టు అధికారి కి వినతి పత్రాలు అందజేసినట్లు మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా ఎస్ఎంఎస్ ప్లాంట్ (ఎక్సప్లొజివ్స్) ఇతర సింగరేణి సివిల్, పర్చేస్ విభాగపు పనులలో పలు ఖాళీలు ఉన్నాయి. అయితే కాంట్రాక్టర్లు అట్టి పనులను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు. సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ పనులలో కాంట్రాక్టర్ అమ్ముకున్న విషయాన్ని సాక్షాధారాలతో సహా నిరూపించాను దయచేసి ఎస్ఎంఎస్ ప్లాంట్, ఇన్ చార్జ్ నరసింహస్వామి,ఓసి-2 ఆయిల్ బ్యారెల్స్ లోడింగ్ అన్ లోడింగ్ (కాంట్రాక్టర్ మునిగల రమేష్ బాబు) ఇతర పనులలో మణుగూరు ఓసి ప్రభావిత గ్రామమైన తిర్లాపురం గ్రామ నిరుద్యోగులకు తొలి ప్రాధాన్యతగా కొత్త మల్లేపల్లి, న్యూ ఎగ్గడి గూడెం,అయోధ్య నగర్, కొత్త కొమ్ముగూడెం, కొత్త కొండాపురం, కొత్త పద్మ గూడెం, మదీనా నగర్, రైల్వే స్టేషన్ బీసీ కాలనీ,జయశంకర్ నగర్, కెసిఆర్ నగర్ గ్రామాలకు చెందిన నిర్వాసిత కుటుంబాల నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించే విధంగా, పైన తెలిపిన పిడిఎఫ్ లతోపాటు పి ఏ పి లు, సింగరేణి కార్మికుల వారసులు స్థానికులకు ఓబి కంపెనీలలో (దుర్గా, మహాలక్ష్మి) 80% ఉపాధి కల్పించే విధంగా తమరు న్యాయం చేయాలని కోరుతున్నాను.అలాగే సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ విభాగంలో డబ్బులు కట్టి నష్టపోయిన నలుగురు నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించాలని అధికారులను వినతిపత్రంలో కోరినట్లు ఆయన తెలిపారు.