మన ధ్యాస:- అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు గోవిందమ్మ కుమారుడి పంచాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక నాయకులు హాజరై బాలుడిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ ఆర్.టి.ఐ వింగ్ కార్యదర్శి పిల్లి తిరుపతిరెడ్డి, స్టేట్ పంచాయతీ రాజ్ జనరల్ సెక్రటరీ పల్లపోలు బాలకోటిరెడ్డి, కొండేపి నియోజకవర్గ లీగల్ సెల్ అడ్వైజర్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.కుటుంబ సభ్యులు, బంధువులు మరియు సన్నిహితుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలో నాయకులందరూ చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో ఎదగాలని ఆకాంక్షించారు.
