తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి ఏప్రిల్ 30 (నాగరాజ సరకింటి )

ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో తవణంపల్లి మండలం 73% ఉత్తీర్ణత సాధించిందని మండల విద్యాశాఖ అధికారులు హేమలత, మరియు మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు 6 మరియు ప్రైవేటు పాఠశాలలు 2 ఉండగా ఈ పాఠశాలల నందు మొత్తం 330 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా వాటిలో 240 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆమె తెలిపారు. అనంతరం తవణంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల 63%, అరగొండ బాలుర పాఠశాల 43%, బాలికల పాఠశాల 70%, వెంగంపల్లి జడ్పీహెచ్ఎస్ 56%, తొడతర జడ్పీహెచ్ఎస్ 65%, కృష్ణాపురం జడ్పీహెచ్ఎస్ 43% ఉత్తీర్ణత సాధించాయని ఆమె వెల్లడించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుండి తిరువైష్ణవి 556 మార్కుల సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానం నిలిచిందని, అలాగే తొడతర జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి ఢిల్లీ ప్రసన్న 554 మార్కులు, తవణంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వర్షిని 541 మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందడం జరిగింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మరియు విద్యార్థుల ఉత్తీర్ణతకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఎంఈవోలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *