మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :జనసేన పార్టీ PAC చైర్మన్,ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల కాలం చేసినారు.మంత్రివర్యులు వారి నివాసం నందు వారి తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు,రౌతు గోవిందరావు,కాదా శ్రీను,గోల్కొటి సోమన్న,మల్లిపూడి మురళి,మింది జయలక్ష్మి,దాసరి జయలక్ష్మి,జ్యోతి తదితరులు కలిసి సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *