మన ధ్యాస ,విజయవాడ, ఏప్రిల్ 16 : భారదేశంలో వెండి ఆభరణాల తయారీలో విశిష్ట అనుభవం కలిగిన రాస సిల్వర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అడుగు పెట్టింది. బెంగుళూరు నగరంలో స్థాపితమైన రాస సిల్వర్ జ్యువెల్స్ బ్రాండు వారసత్వ అనుభవముతో తమ బ్రాండు ఆభరణాలతో ఆంధ్రప్రదేశ్ లో కూడ సుస్థిర స్థానం సాధించే లక్ష్యంతో విజయవాడలో ప్రవేశించినది. ఆభరణాలకు ఒక మంచి గుర్తింపు, సంప్రదాయత మరియు భావవ్యక్తీకరణలకు నిలయమైన విజయవాడలో రాస సిల్వర్ ఆవిష్కరణ ఒక అద్భుతమైన వేదిక.రాస సిల్వర్ షోరూం నందు ఒక మహిళ తానూ చిన్న నాటినుండి కోరుకునే వేలాది రకాల ఆభరణాలును ఆమె ముందు తెస్తుంది. ఆమె రోజు వారు ధరించాలి, వేడుకల సమయంలో ధరించాలి, తను పెళ్ళికూతురుగా ధరించాలి అనుకునే ఆమె ఉహించుకునే అభిరుచికి తగిన ఎన్నో రకాల ఆభరణాలు ఈ షోరూం నందు ఆమె కోసం ఎదురు చూస్తుంటాయి. ఇక్కడ ప్రతి ఆభరణం 925 వన్నె వెండితో కళాకారులు బంగారు ఆభరణాలకు ఏ మాత్రం తగ్గేది లేదు అన్న రీతిలో అద్భుతంగా రూపొందిస్తారు. వీటిలో అన్ కట్ కుందన్ గ్లాస్ వర్క్, రత్నాలు పొదిగిన ఆభరణాలు, టెంపుల్ ఆభరణాల ప్రేరణతో క్లాసిక్ పోల్కీ, జదావ్, నవరత్న శైలిలో నిపుణులైన కళాకారుల చేతిలో అత్యంత నైపుణ్యంగా తీర్చిదిద్దుకుంటాయి. రాస సిల్వర్ షోరూం నందు ప్రతి ఆభరణం ధరించటానికే తయారు చేస్తారు. ఆభరణాలను దాచిపెట్టుకుని ఏదో పండుగ వస్తేనో, వేడుకలకో మాత్రమే ధరించటానికి కాదు. రాసా సిల్వర్ ప్రారంభం సందర్భంగా మానన్ బోహ్రా, సహా-వ్యవస్థాపకులు, రాసా సిల్వర్ జ్యువెల్స్ వారు మాట్లాడుతూ……ఖాతాదారులు ఆభరణాలు ధరించినపుడు పొందే భావోద్వేగం మరియు వారి మానసిక అనుభూతి ఆధారంగా మేము ఆభరణాలను రూపొందిస్తాము అన్నారు. విలాసవంతంగా ఆభరణాలు ధరించాలి అనుకునే వారికి వాటి ధర అడ్డంకి కాకూడదు. మేము ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లోనికి నూతనంగా ప్రవేశించి నప్పటికీ ఆభరణాల డిజైన్స్, నాణ్యత, హస్తకళా నైపుణ్యాలలో ఎలాటి రాజీ పడే ప్రసక్తి లేకుండా అన్ని రకాల ఆభరణాలను అందరికి అందుబాటులోనికి తెస్తాము అన్నారు. విజయవాడ నగరం ఆభరణాలు సంస్క్రతి సంప్రదాయాలకు పెట్టింది పేరు, అందుకు తగిన విధంగా మేము ఆభరణాలు తయారు చేసి అందిస్తామనే విశ్వాసం ఆయన వ్యక్తపరిచారు.రాసా సిల్వర్ తమ వారసత్వ సంపదతో ప్రతి మహిళా తానూ ఉహించుకునే ఆభరణాన్ని ధరించి అద్దం ముందు నిలబడి పొందే గొప్ప అనుభూతిని రాసా అందిస్తుంది. ఆభరణాలు ఎప్పుడో ధరించి విలాసవంతమైన అనుభూతి పొందటం కాదు, రాసా ఆభరణాలు ప్రతి రోజు ధరించి, తమ ప్రతి బింబం అద్దంలో చూసుకుని గర్వపడాలి. ఆభరణం ఆడంబరంగా మాత్రమే కాక తమ ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలవాలి. రాసా సిల్వర్ విజయవాడ నగరంతో ఆగిపోదు, తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రముఖ నగరాలకు విస్తరిస్తుంది. రాసా వెండి ఆభరణాలు ప్రతి ఇంట, ప్రతి నగరంలోను చివరకు ప్రపంచం నలుమూలలకు విస్తరించాలి.
