కలిగిరి, నవంబర్ 18 మన ధ్యాస ప్రతినిధి – శ్రీకాంత్ కుట్టుబోయిన

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్రం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌కు అమర్చిన రోటవేటర్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అది జారిపడి మీద పడటంతో నవీన్ (26) అనే యువ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.ట్రాక్టర్ రోటవేటర్‌కు మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పల్లపు పెద్ద తిరుపతయ్య కుమారుడైన నవీన్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికొచ్చిన కుమారుడు అకాల మరణం చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.యువ రైతు మృతితో నాగసముద్రం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎస్ఐ లతీఫున్నీసా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *